Monday, December 23, 2024

బిగ్‌బిలియన్‌ డేస్‌ 2022: ట్రావెల్‌ ఫెస్టివల్స్‌ను ప్రకటించిన క్లియర్‌ ట్రిప్‌

- Advertisement -
- Advertisement -

Cleartrip launches discount offers on People's Travel

హైదరాబాద్‌: భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్స్‌లో ఒకటైన క్లియర్‌ ట్రిప్‌ రాబోతున్న పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ‘ద బిగ్‌ బిలియన్‌ డేస్‌’లో భాగంగా భారతదేశంలో అతిపెద్ద ట్రావెల్‌ ఫెస్టివల్స్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌కు అనుగుణంగా ఈ ఫెస్టివల్‌, క్లియర్‌ ట్రిప్‌ వెబ్‌సైట్‌ మరియు యాప్‌పై ట్రావెల్‌ షాపింగ్‌ సందడిగా నిలిచింది.

సెప్టెంబర్‌ 22 న ప్రారంభమైన ఈ పండుగలో క్లియర్‌ట్రిప్‌ వినియోగదారులు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను అంతర్జాతీయ విమానాలపై అతి తక్కువగా 6999 రూపాయలు మరియు దేశీయ విమానాలపై 999 రూపాయలలో టిక్కెట్లను పొందవచ్చు. దేశీయ హోటల్స్‌లో కేవలం 199 రూపాయలకే రూమ్‌ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌ ఇప్పుడు ట్రావెల్‌ పరిశ్రమలో వినూత్న ఆఫరింగ్‌ను ఈ పండుగ సీజన్‌ కోసం అందిస్తుంది. క్లియర్‌ట్రిప్‌ ఇప్పుడు ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుని అంతర్జాతీయ ఫ్లైట్స్‌పై 20% వరకూ, దేశీయ ఫ్లైట్స్‌పై 35% వరకూ రాయితీ అందిస్తున్నాయి. అంతేనా, దేశీయ హోటల్స్‌లో బై ఒన్‌ గెట్‌ ఒన్‌ (బోగో) ఆఫర్స్‌ను సైతం అందిస్తుంది. ఓటీఏ విభాగంలో అగ్రగామిగా క్లియర్‌ట్రిప్‌ ఇప్పుడు వందలాది మంది భాగస్వాములను ట్రావెల్‌, ఆతిధ్య రంగాల నుంచి ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటుగా ప్రజలకు వినూత్నమైన అవకాశాలను అందిస్తుంది. ఈ ఆఫర్లలో

1. దేశీయంగా విమాన టిక్కెట్స్‌ 999 రూపాయల నుంచి అంతర్జాతీయ ఫ్లైట్స్‌ 6999 రూపాయల నుంచి ప్రారంభం

2. శిశువులు/పిల్లలకు ఉచితంగా ప్రయాణం

3. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులపై దేశీయ విమానాలపై 35% వరకూ రాయితీ

4. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులపై విదేశీ విమానాలపై 20% వరకూ రాయితీ

5. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులపై (24–30 సెప్టెంబర్‌) హోటల్స్‌పై 35% రాయితీ

6. 3 స్టార్‌ హోటల్‌లో చార్జీలు 199 రూపాయల నుంచి ప్రారంభం

7. దేశీయ హోటల్స్‌పై 20–70% తగ్గింపు

8. ప్రీమియం స్టే స్‌ పై ఒకటి కొంటే ఒకటి ఉచితం

9. 40% తగ్గింపుతో ప్రతి రోజూ ఆకర్షణీయమైన అమ్మకాలు

10. నాలుగు మరియు 5 స్టార్‌ వసతి 1499 రూపాయల నుంచి ప్రారంభం మరియు మరెన్నో ఆఫర్లు ఉన్నాయి

ద బిగ్‌ బిలియన్‌ డేస్‌ను క్లియర్‌ ట్రిప్‌ వేడుక చేయడం గురించి అయ్యప్పన్‌ .ఆర్‌, సీఈఓ– క్లియర్‌ ట్రిప్‌ మాట్లాడుతూ ‘‘ పండుగ సీజన్‌ అంటేనే సెలవుల కాలం. కుటుంబమంతా కలిసే కాలమిది. ఈ ఆలోచనతోనే భారీ షాపింగ్‌ ఫెస్టివల్‌లో ఎలాంటి అనుభవాలను పొందుతున్నారో, అవే తరహా అనుభవాలు వినియోగదారులు, ట్రావెల్‌ పరిశ్రమకు అందించాలనుకున్నాము. కాకపోతే కాస్త వైవిధ్యంగా ఈ అనుభవాలను అందించాలనుకున్నాము. నాలుగు లేదా 5 స్టార్‌ హోటల్స్‌లోవసతిని ఊహించని వారు సైతం ఇప్పుడు ధైర్యంగా రూమ్‌లను బుక్‌ చేసుకునేలా వీటిని తీర్చిదిద్దాము.అదే రీతిలో పరిశ్రమలో సాటిలేని రీతిలో డీల్స్‌ను ఫ్లైట్స్‌పై కూడా అందిస్తున్నాము. మా టీమ్‌లు24 గంటలూ శ్రమించి మా ప్లాట్‌ఫామ్‌పై సౌకర్యవంతమైన అనుభవాలను అందిస్తున్నారు. అంతేకాదు, వినియోగదారులకు మరింత సౌకర్యం అందిస్తూ నామమాత్రపు ఫీజుతో విమాన టిక్కెట్ల క్యాన్సిల్‌ లేదా మాడిఫై చేసుకునే అవకాశమూ అందిస్తున్నాము’’ అని అన్నారు.

ఈ ఆఫర్‌లను గురించి ప్రజలకు మరింత తెలిసేలా బాలీవుడ్‌ సెలబ్రిటీ జంట విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌లతో క్లియర్‌ ట్రి్‌ప్‌ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం గురించి వారు మాట్లాడుతూ ‘‘క్లియర్‌ ట్రిప్‌తో భాగస్వామ్యం పట్ల సంతోషంగా ఉన్నాము. వారి తాజా ఔట్‌లుక్‌, ట్రావెల్‌ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తీరు పట్ల ఆనందంగా ఉన్నాము’’ అని అన్నారు. ఈ ఆఫర్లు సెప్టెంబర్‌ 30 వరకూ క్లియర్‌ ట్రిప్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌పై లభ్యవవుతాయి.

Cleartrip launches discount offers on People’s Travel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News