Monday, January 27, 2025

ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలు.. అర్హత, జీతం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లర్క్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేపటనున్నది. ఇప్పటికే దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైనది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఖాళీల సంఖ్య : 13735
ఖాళీల వివరాలు : క్లర్క్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ పోస్టులు
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు: OBC – 3001 ఖాళీలు, SC – 2118 ఖాళీలు, ST – 1385 ఖాళీలు, EWS – 1361 పోస్ట్‌లు (SBI ఖాళీల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఏ అభ్యర్థి అయినా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి)
దరఖాస్తు చివరి తేదీ: 2025 జనవరి 7
వయసు: వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1996 ఏప్రిల్ 2 నుండి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.
విద్య అర్హత: గ్రాడ్యుయేషన్
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రాంతీయ భాషాలో పరీక్ష రాయాలి
జీతం: రూ.17,900 నుండి రూ.47,920 వరకు ఉంటుంది
వెబ్ సైట్: sbi.co.in
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల సంఖ్య: ఆంధ్రప్రదేశ్‌లో 50 పోస్టులు, తెలంగాణలో 342 పోస్టులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News