Monday, December 23, 2024

 ఆ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు

- Advertisement -
- Advertisement -

నెల్లూరులో ఉద్యోగాల పేరిట యువతీ యువకులకు వలవేసి డబ్బు గుంజుతున్న ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఈ ముఠా ముందుగా నిరుద్యోగుల వివరాలు సేకరిస్తుంది. ఆ తర్వాత వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఓ లింక్ పంపిస్తుంది. లింక్ ను క్లిక్ చేయగానే పది శాతం డిపాజిట్ చేయాలని అడుగుతారు. ఆ డబ్బు జమ కాగానే ఇక నిరుద్యోగుల మొహం కూడా చూడరు. గార్లదిన్నెకు చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులనుంచి సైబర్ నేరగాళ్లు ఇలా 35 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 11 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిందట. మొత్తం 170కి పైగా బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు ఈ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు పోలీసులు సమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News