Monday, November 25, 2024

పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్

- Advertisement -
- Advertisement -

అడవుల పునరుద్దరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భేష్
ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో యుఎస్‌ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి

climate change is the biggest challenge facing humanity

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్ అని యుఎస్‌ఎఐడి (అంతర్జాతీయ అభివృద్ధి కోసం యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ) మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్‌లో జరిగిన ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశానికి వీణారెడ్డి, ఇతర ప్రతినిధుల బృందం హాజరయ్యారు. భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో మూడు జిల్లాల్లో యుఎస్‌ఎఐడి ఫారెస్ట్ ప్లస్ 2.0 అమలు చేస్తోందన్నారు. తెలంగాణలో మెదక్ జిల్లాతో పాటు బీహార్, కేరళ రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

భౌగోళిక మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అడవుల పునరుద్దరణ, జీవవైవిధ్యం కాపాడటం ఫారెస్ట్ ప్లస్ ప్రత్యేకత అని అన్నారు. మెదక్ జిల్లాలో చేపట్టిన ఫారెస్ట్ ప్లస్, గత మూడేళ్ల పురోగతిపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (కంపా), నోడల్ ఆఫీసర్ లోకేష్ జైస్వాల్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణలో అటవీ పునరుద్దరణ, ఫారెస్ట్ ప్లస్ పనుల పర్యవేక్షణకు క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని యుఎస్‌ఎఐడి బృందాన్ని పిసిసిఎఫ్ ఆర్.శోభ ఆహ్వానించారు.

అలాగే ఫారెస్ట్రీ మేనేజ్ మెంట్, అమెరికా పద్దతులు, కొత్త టెక్నాలజీని అధ్యయనం చేసేందుకు తెలంగాణ అధికారుల బృందం అమెరికాలో పర్యటించేలా చూడాలని కోరారు. అందుకు వీణా రెడ్డి అంగీకరించారు. పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు యుఎస్‌ఎఐడి తరపున రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఫారెస్ట్ ప్లస్ నోడల్ ఆఫీసర్ లోకేష్ జైస్వాల్ కోరారు. సమావేశంలో వర్గీస్ పాల్, సీనియర్ ఫారెస్ట్రీ అడ్వయిజర్, యుఎస్‌ఎఐడి, వంశీధర్ రెడ్డి, డెవలప్ మెంట్ స్పెషలిస్ట్ (అగ్నికల్చర్), మార్తావాన్ లీయిసౌట్, సీనియర్ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్, వినయ్ కుమార్, అడిషనల్ పిసిసిఎఫ్ సీ. శరవనన్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్, జీ. సాయిలు, రీజనల్ డైరెక్టర్, ఫారెస్ట్ ప్లస్ 2.0 అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News