ప్రకృతి తన సహజమైన నీరు, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, చక్రీయ విధానాలతో పర్యావరణంలో సామరస్యతనేర్పుతూ మొదట్లో మానవుడు తన చర్యల ద్వారా పర్యావరణానికి ఏ ఇబ్బంది కలుగని విధంగా జీవించాడు. కాని కాలక్రమేణా మన జీవన శైలిని మార్చుకునే క్రమంలో ప్రకృతి నిర్వహిస్తున్న సమతా స్థితికి ఆటంకాలు కలిగిస్తున్నాడు. తన ఆశలు, అవసరాలు తీర్చుకుని వాటి కోసం ప్రకృతిలోని సహజ వనరులను విపరీతంగా వాడుకోవడం మొదలు పెట్టి తన మనుగడకే ప్రమాదం కొనితెచ్చుకుంటున్నాడు. వాతావరణం అంటే భూమి చుట్టూ పరివేష్టితమై ఉండే వాయు పొరను వాతావరణం అంటారు. సూర్యుని నుంచి వచ్చే విద్యుత్ అయస్కాంత కిరణంలో కొంత భాగాన్ని ఇది శోషించుకుని వికిరణాలను ప్రసారం చేస్తుంది. భూమిపై ఉష్ణ సమతుల్యాన్ని కాపాడడంలో ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. గాలిలోకి ఆక్సిజన్, నైట్రోజన్‌లు మానవుని కార్యాకలాపాల వల్ల భంగం కలుగుతూ సమతుల్య వ్యవస్థ దెబ్బతిని చాలా అనర్థాలకు దారి తీస్తుంది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి కారణంగా ప్రకృతి వనరులు తరిగిపోతున్నాయి.
మానవుడు ప్రకృతిలో లభ్యమయ్యే ఎన్నో పదార్థాలను కృత్రిమంగా తయారు చేస్తున్నాడు. దీనిలో భాగంగా ఎన్నో పరిశ్రమలు స్థాపిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇలా ఎన్నో సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యాకలాపాలతో ఎన్నో వ్యర్థ పదార్థాలు పర్యావరణంలోకి వచ్చి దాన్ని భయంకరంగా కలుషితం చేస్తున్నాయి. దీంతో కాలుష్యం భూగోళ ప్రక్రియగా మారింది. కాలుష్యానికి కారణాలు జనాభా పెరుగుదల, పట్టణాభివృద్ధి, అడవుల నరికివేత, ఇంధన దహనం మొదలైనవి కాలుష్యానికి కారణాలు. దుమ్ము, వాయువు, తేమ, వాసన, పొగ, పొగమంచు, ఆవిరులు వంటి మలినాలు మనుషులకు, మొక్కలకు, ఆస్తులకు నష్టం కలిగించే మోతాదులో వాతావరణంలోని దారిలో ఉంటే దాన్ని వాయు కాలుష్యం అంటారు. ఇది గాలిలోని సమతుల్యాన్ని దెబ్బతీసే జీవరాశులపై దుష్ప్రభావాలను చూపుతుంది. గాలిలో ఉండే కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్పరాక్సైడ్, ఓజోన్, క్లోరోప్లోర్ కార్బన్, హైడ్రోకార్బన్, మోగ్ లోహాలు, దూళీ వంటి కాలుష్య కారకాల వల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది.
కాలుష్య ప్రభావం వాతావరణం కాలుష్యం తీవ్ర ప్రభావాలను చూపుతూ మానవుని మనుగడనే ప్రశ్నిస్తున్న రోజులివి. కార్బన్ డై ఆక్సైడ్ వల్ల దృష్టి కోల్పోవడం, తలనొప్పి, అలసట, స్పృహ కోల్పోవడం చివరకు మరణం సంభవించవచ్చు. నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల పళ్లు ఎర్రగా మారుట, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలుగుట, కిరణ జన్య సంయోగక్రియ వేగం తగ్గి ఆకులు నాశనం అగుట, మానవ జీవకణాలకు, లోహాలకు హాని కలిగించుట, సల్పరాక్సైడ్ వల్ల నైట్రోజన్ ఆక్సైజ్‌లతో కలిసి వర్షపు నీటితో వర్షాల రూపంలో భూమిని చేరుతుంది. దీంతో పురాతన కట్టడాలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. క్లోరోప్లోర్ కార్బన్ వల్ల పరిశ్రమలకు వరాలు, కాని పర్యావరణానికి శాపాలు అన్ని చెప్పవచ్చు. వీటితో త్రిమాణులుగా పిలుస్తారు. చవకగా ఉండటం సులువుగా ఉపయోగించడం వల్ల శీతలీకరణ సామగ్రిలో రాలుతున్నాయి. కాని ఇది చెడిపోతే వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపి ఓజోన్ పొరను విచ్ఛిత్తి చెందిస్తాయి. దీంతో సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై ప్రసారం చెందడంతో చర్మ క్యాన్సర్, దృష్టిలోపం మరణం సంభవించును. స్మోగ్ వల్ల శిలాజ ఇంధనాల దహనం వల్ల వెలువడే వాయువు వాతావరణంలో స్మోగ్‌గా మారుతుంది.
దీనిలో ప్రధానంగా ఓజన్ ఎన్‌వొ, హెచ్‌సిహెచ్‌వొ, పిఎఎన్‌లు తీవ్ర ప్రభావాలను చూపుతుంది. గొంతులో దురద, తల, చాతినొప్పి, శ్వాసకోశ వ్యాధులు సంభవించును. గ్రీన్ హౌస్ వాయువు వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్, హైడ్రోజన్ ఆక్సైడ్, ఇథేన్, ఓజోన్ మొదలైన వాయువు భూగోళం వేడెక్కడానికి కారణమవుతున్నాయి.ఈ వాయువుగా పరిమాణం ఎంత ఎక్కువైతే భూమి అంత ఎక్కువగా వేడెక్కుతుంది. హిమానీ నదాలు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది. తద్వారా సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. అకాల వర్షాలు, తుపాన్లు, ఉప్పెనలు రావచ్చు. వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించవచ్చు. మానువుని మనుగడను శాసిస్తున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన సమయం ఆసన్నమైంది.ఇప్పటికైనా మానవుడు కళ్లు తెరవకుంటే శాశ్వతంగా కళ్లుమూయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అగ్రదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కాలుష్య నివారణకు నడుం బిగించాయి. వీటిలో శీతలీకరణ సామగ్రిలో ఉపయోగించి త్రీమాణుల స్థానంలో క్లోరోనైట్రో కోర్బన్‌లు వాడేందుకు చర్యలు తీసుకోవాలి.
కార్బన్ డైయాక్సడ్‌లను శాసించుకునే మొక్కలు, చెట్లు పెంచాలి. అడవుల నరికివేత ఆపివేయాలి. దీంతో గ్రీన్ హౌస్ వాయువులు భూమిపైకి చేరకుండా నిరోధించవచ్చు. పారిశ్రామిక వ్యర్ధ పదార్థాలను శుద్ధిచేసి వదిలి వేయాలి. జనాభా పెరుగుదలను నియంత్రించడం, వ్యర్ధ పదార్థాల నిర్వహణ లాంటి చర్యలు చేపట్టినట్లయితే కాలుష్యాన్ని నివారించవచ్చు. వాతావరణ కాలుష్యం నివారణ అందరి బాధ్యత. స్వచ్ఛమైన గాలిని నీరును పొందేందుకు అందరూ కృషి చేయాలి. అడవుల నరికివేత ఆపడమే కాకుండా చెట్లను పెంచాలి. శిలాజ ఇంధనాల దహనాన్ని ఆపాలి. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తమ బాధ్యతలను సరిగా నిర్వహించాలి. సామాన్యునికి వాతావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే స్వచ్ఛమైన వాతావరణం దినోత్సవాన్ని జరుపుకోవచ్చు.