Sunday, December 22, 2024

వైద్యులకు అధునాతన వైద్య సౌకర్యాలపై అవగాహన అవసరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని పలు శివారు ప్రాంతాలలో క్లినిక్ లు నిర్వహిస్తున్న పలువురు వైద్యులను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నిర్వహకులు ఘనంగా సన్మానించారు. వరల్ ఫ్యామిలీ డాక్టర్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసదస్సులో వైద్య రంగంలో అందుబాటులోనికి వస్తున్న పలు ఆధునిక చికిత్సలు, పరీక్షలు వంటి వాటిని ఆస్టర్ ప్రైమ్ వైద్య నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా డా. సృజన్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ మాట్లాడుతూ కుటుంబ వైద్యునికి గతంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అన్నారు.

నిరంతరం అందుబాటులో ఉండే కుటుంబ వైద్యునికి ఆ కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య సమస్యల పట్ల ఎంతో అవగాహన ఉండేదని తద్వారా వారు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించే వారన్నారు. తద్వారా రోగాలు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే రోగులు ఏదైనా ఇబ్బంది వస్తే స్వంత వైద్యం లేదా పెద్ద హాస్పిటల్ కు పరిగెత్తకుండా ముందు తమకు దగ్గరలో ఉన్న కుటుంభ వైద్యులను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News