Monday, December 23, 2024

పార్కింగ్ లేని విద్యాసంస్థలను మూసేయండి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్ అసలే అది అత్యంత రద్దీ ప్రాంతం… షాపింగ్‌మాల్స్, సినిమా హాల్స్‌లు మాత్రమే కాకుండా అన్ని రకాల వ్యాపారాలకు నిలయం ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో విద్యాసంస్థలకు అనుమతులను ఇవ్వాలంటే ఎన్నో జాగ్రత్తలు తీ సుకోవాల్సి ఉంటుందో వేరేగా చెప్పాల్సి అవసరం లేదు. అయితే విద్యాశాఖ అధికారుల పుణ్యామా అని అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన పలు ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కళాశాలలతో పాటు కోచింగ్ సెంటర్ల కారణంగా విదార్థులతోపాటు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇందిరానగర్, ఎస్‌బిఐ, శాలివాహన నగర్ తదిత ర కాలనీల వాసులలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళాశాలలు వెలిసిన భవనాలకు కనీసం సౌకర్యాలు ఉ న్నాయా లేవా అన్ని కనీస తనిఖీలు కూడా చేయకుండా ఇటు ఇంటర్ బోర్డు అధికారులు అటు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఇష్టానూసారంగా అనమతులను ఇవ్వడంతో అద్దెపరంగా తమకు అనుకూలమైన భవనాలను తీసుకుని ఇష్టారీతిలో ప్రైవేట్ యాజమన్యాలు కళాశాలలను ఏర్పాటు చేరంటూ వాపోతున్నారు. ఈ భవనాల్లో కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా లేకపోగా అనేక కళాశాలల భవనాల్లో ఫైర్ సేఫ్టీ మచ్చుకైన కనిపించని పరిస్థితి నెలకొందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో వందల సంఖ్యలో ఇంటర్ , డిగ్రీ కళాశాలలు ఉండడంతో వే లాది మంది విద్యార్ధులు వీటిలో చదువుకుంటున్నారని, అయితే కళాశాలల్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వారంత తమ వాహనానలు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో నరకం చవి చూడాల్సి వస్తోందని స్థానిక కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్‌లు రావాలన్నా పోవాలన్నా దారిలేక ఆలస్యం కారణంగా సకాలంలో వైద్యం అందక బాధితులు మృతి చెందన సంఘటనలు ఉన్నాయని వా పోతున్నారు. అదేవిధంగా కాలనీల్లోకి వాటర్ ట్యాం కులు రావాలన్న ఇదే పరిస్థితి ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టానుసారంగా కళాశాలలు ఏర్పాటు చే సిన విద్యార్థులకు కనీస సౌకర్యాలను కూడా కల్పించని యాజమన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు వెంటనే ఇంటర్ విద్యా శాఖ అధికారులతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయాల అధికారులు అన్ని కళాశాలల్లో మౌ లిక సదుపాయాలను తనిఖీ నిర్వహించాలని కోరుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించని కళాశాల యాజమన్యాలపై పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News