Tuesday, November 5, 2024

పంజాబ్‌లో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాల మూత

- Advertisement -
- Advertisement -

Close of 3 thermal power plants in Punjab

రోజుకు ఐదారు గంటల కరెంటు కోతలు

చండీగఢ్ : వ్యవసాయాధారిత రాష్ట్రం అయిన పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తి సంక్షోభం తలెత్తింది. బొగ్గు కొరతతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనితో పంజాబ్‌లో మూడు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గమనించి కేంద్రం వెంటనే రాష్ట్రానికి అవసరం అయిన బొగ్గు కోటాను పునరుద్ధరించడమే కాకుండా దీనిని పెంచాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థం 5620 మెగావాట్లు. అయితే ఇప్పుడు కేవలం 2800 ఎండబ్లుల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇది బొగ్గు కొరతతో నెలకొన్న పరిస్థితి అని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి కేంద్రానికి విన్నవించుకున్నారు. ఇప్పటికే గత మూడు నాలుగు రోజుల వ్యవధిలో మూడు థర్మల్ యూనిట్లు మూతపడ్డాయి. ఇక మిగిలిన 7విద్యుత్ కేంద్రాల ద్వారా ఇప్పటి బొగ్గు కోటా సరఫరా స్థితితో కేవలం నాలుగు రోజులే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

పంజాబ్‌లో కరెంటు కోతలతో జనం నిరసనలు

పంజాబ్‌లో తీవ్రస్థాయి విద్యుత్ కోత పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు పంజాబ్ విద్యుత్ సంస్థ పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలుకు దిగింది. ఇచ్చిపుచ్చుకునే ప్రాతిపదికన ఈ మేరకు విద్యుత్ బేరాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ప్రైవేటు కరెంటు తీసుకున్న పరిస్థితితో ప్రభుత్వానికి అదనపు భారం పడుతోందని పంజాబ్ విద్యుత్ సంస్థ ఛైర్మన్ ఎ వేణు ప్రసాద్ తెలిపారు. ఇక ఉత్పత్తి సరిగ్గా లేకపోవడంతో రోజుకు కనీసం ఆరుగంటల వరకూ విద్యుత్ కోతలకు దిగుతున్నారు. దీనితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాలకు వెళ్లుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News