Thursday, November 14, 2024

యుపిలో మైనర్ బాలికపై సమీప బంధువు లైంగికదాడి

- Advertisement -
- Advertisement -

Close relative sexually assaults minor girl in UP

 

అమేథీ: 15 ఏళ్ల బాలికపై ఆమె సన్నిహిత బంధువే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో జరిగింది. మోహన్‌గంజ్ గ్రామ సమీపంలోని ఓ తోటలో లైంగికదాడికి పాల్పడిన దుండగుడు బాలికను అపస్మారకస్థితిలో అక్కడే వదిలేసి పోయాడు. కూతురి పరిస్థితి గురించి తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. మార్చి 8న ఈ దారుణం జరిగింది. బాలిక అమ్మమ్మ తరఫు బంధువు ఇంటికి తీసుకెళ్లే సమయంలో దుండగుడు ఈ దారుణానికి తెగబడ్డట్టు చెబుతున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News