Monday, December 23, 2024

మూసివేసిన ఆర్‌టిసి డిపోలను వెంటనే తెరవాలి: హనుమంతు ముదిరాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో మూసివేసిన ఆర్‌టిసి డిపోలను వెంటనే తెరవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(టిజెఎంయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి జరగాలంటే రవాణాసౌకర్యం మెరుగపడాల్సిన అవసరం ఉందని తదనుగుణంగా సిఎం కెసిఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే 1500 గ్రామాలకు పైగా బస్సులు లేవని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలంటే కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్‌టిసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News