Sunday, January 19, 2025

సూర్యుడి కంటే పది రెట్లు పెద్దదైన కృష్ణబిలం గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Blackhole bigger than Sun

కేప్ కెనెరావెల్:   కనీసం కాంతిని కూడా చొరబడనివ్వని అంతరిక్ష అగాథాలు కృష్ణబిలాలు. వీటినే బ్లాక్ హోల్స్ అంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఓ భారీ కృష్ణబిలాన్ని కనుగొన్నారు. భూమికి అత్యంత చేరువలో ఉన్న కృష్ణబిలం ఇదే. ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కంటే 10 రెట్లు పెద్దది. ఒఫియకస్ నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు వెల్లడైంది.

కృష్ణబిలాల మర్మం పరిష్కరించబడింది, అయితే భూలోకవాసులకు  ఇంకా రహస్యంగా ఉంది. ఆశ్చర్యకరమైన ఆలోచనను 1783లో జాన్ మిచెల్ అనే ఇంగ్లీష్ వ్యక్తి ప్రకటించగా, ఇప్పటి వరకు విశ్వం అంతటా అనేక కృష్ణబిలాలు కనుగొనబడ్డాయి.
ఇంతక్రితం కనుగొన్న కృష్ణబిలం కంటే ఇది భూమికి మూడు రెట్లు చేరువలో ఉంది. ఇది నక్షత్ర ద్రవ్యరాశి విభాగానికి చెందినదని భావిస్తున్న పరిశోధకులు, అసాధారణ అంతరిక్ష భాగాల పరిణామక్రమం గుట్టు విప్పేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.

శాస్త్రవేత్తల్లో మరింత ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏమిటంటే… పాలపుంతలో నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాన్ని స్పష్టంగా గుర్తించడం ఇదే ప్రథమం. నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చితే 5 నుంచి 100 రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇలాంటివి ఒక్క పాలపుంతలోనే 100 మిలియన్ల వరకు ఉంటాయట.

ఈ వివరాలు రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ నెలవారీ ప్రచురణల్లో చోటుచేసుకున్నాయి. ఈ కృష్ణబిలంతో పాటు ఉన్న మరో నక్షత్రాన్ని కూడా పరిశోధకులు హవాయిలో ఉన్న జెమినీ నార్త్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News