Wednesday, January 22, 2025

రూ.10లతో లాక్‌డౌన్ కేసుల మూత

- Advertisement -
- Advertisement -

Closure of lockdown cases with Rs 10

 

మన తెలంగాణ /హైదరాబాద్ : నగరవాసులకు ప్రభుత్వం మరో వెసులుబాటును కల్పించింది. లాక్‌డౌన్ కేసుల బాధితులకు ఉపశమనం కల్పిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభణతో లాక్‌డౌన్ కాలంలో తెలిసి, తెలియక, నిబంధనలకు విరుద్దంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వారిపై అప్పట్లో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఒక్కక్కరికి రూ. 1000లను జరిమానా విధించారు. అయితే ఈ నెల 2 వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ వారం రోజుల్లో రూ.1000ల స్థానంలో కేవలం రూ.10లు చెల్లించి ఆయా కేసులను నుంచి విముక్తి పొందేందుకు బాధితులకు ప్రభుత్వం, కోర్టులు వెసులుబాటును కల్పించాయి. ఇందుకు సంబంధించి గతంలో ఏ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యాయో అదే పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆధార్ కార్డును సమర్పించి రూ.10లను చెల్లిస్తే కోర్టుకు వెళ్లే పని లేకుండానే పోలీసులే ఆ కేసును మూసివేయనున్నారు. అయితే ప్రతి సెక్షన్‌కు రూ. 10ల చోప్పున ఎన్ని సెక్షన్లు పెట్టితే అన్ని రూ.10లు చెల్లించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ కాలంలో కేసులు నమోదైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోలీసులు అధికారులు సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News