- Advertisement -
కొలంబో : నార్వే రాజధాని ఓస్లో, ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని రాయబార కార్యాలయాలతో పాటు సిడ్నీ లోని వాణిజ్య రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడంతో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అధికార కూటమిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. సోమవారం రాత్రి రాజపక్స తాను రాజీనామా చేయబోనని, పార్లమెంటులో 113 మంది సభ్యులు గల పార్టీకి ప్రభుత్వాన్ని అప్పగిస్తానని ప్రకటించారు.
- Advertisement -