Sunday, April 6, 2025

హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వర్షం అనేది మేఘం నుండి పడే ఘనీభవించిన నీరు. ఐఎండి  ప్రకారం గంటకు 100మి.మీ చొప్పున భారీ వర్షపాతాన్ని క్లౌడ్‌బరస్ట్ గా పిలుస్తారు. క్లౌడ్ బరస్ట్ అనేది హిమాలయ పర్వత సానువుల్లో ఉండే ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సాధారణంగా కనిపిస్తుంటుంది. ఒక్కసారి కురిసే కుండపోతకు వరదబారిన పడతాయి ఆ ప్రాంతాలు.

ఇక విషయానికి వస్తే, నేడు(శుక్రవారం) హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. నగరంలోని మురాద్ నగర్ పోస్టాఫీస్ లైన్ లో ఇది సంభవించింది. విశేషమేమిటంటే కేవలం 6 అడుగుల పరిధిలోనే భారీగా వాన పడింది. ఈ ఘటనను ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా వైరల్ అవుతోంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News