- Advertisement -
అనేక ప్రాంతాలు జలమయం
కొచ్చి: నేడు(మంగళవారం) కొచ్చిలో మేఘ విస్ఫోటనం(క్లౌడ్ బర్ట్స్) కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుండపోత వర్షానికి కారణం మేఘ విస్పోటమేనని నిపుణులు చెబుతున్నారు.
కొచ్చిన్ యూనివర్శీటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ లో కేవలం గంటలోనే 98.4 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. నీరు నిలబడిపోవడంతో కక్కనాడ్-ఇన్ఫోపార్క్, అలువ-ఎడప్పల్లి ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్థంబించిపోయింది. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా అరూర్ ప్రాంతంలోని నేషనల్ హైవేలో.
కొచ్చి జిల్లాలో వాన ఉదయం 8.30 కి మొదలయి దాదాపు నాలుగు గంటలపాటు కురిసింది. వానలకు కక్కనాద్, కలమస్సేరి బాగా ప్రభావితం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ప్రజలు ఇళ్లు వదిలి బయటికి రాలేకపోయారు. వానకు వాహనాలు నత్తనడకలా సాగాయి.
- Advertisement -