Wednesday, January 22, 2025

సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ కు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. నాలుగు నెలల్లో సిఎం కెసిఆర్ ను, ఆయన పార్టీని బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగనే సిపిఎస్ రద్దు చేస్తామని భట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీ కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్ వచ్చిందనే చెప్పాలి. తెలంగాణలో అధికార పార్టీ బిఆర్ఎస్ ఏ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు కౌంటర్స్ వేస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై స్పందించిన భట్టి విక్రమార్క సిఎంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News