Saturday, April 26, 2025

సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కకు స్వల్ప అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పీపుల్స్ మార్చ్ పేరిట గత 62 రోజులుగా పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క షుగర్ లెవెల్స్ తగ్గడంతో గురువారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థతకు గురైన ఆయనకు డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ బస శిబిరం వద్దకు వచ్చి ఆరోగ్యాన్ని పరీక్షించారు. షుగర్ లెవెల్స్ తగ్గాయని తెలిపారు. ఎండలకు వందల కిలోమీటర్లు దూరం నడవడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని చెప్పారు. తీవ్రమైన ఎండలకి వందల కిలోమీటర్లు నడవడం వల్ల వడ దెబ్బ, డి హైడ్రేషన్‌కు భట్టి గురయ్యారని డాక్టర్ ధ్రువీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News