Sunday, January 19, 2025

సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న భట్టి విక్రమార్క పాదయాత్ర అక్కడి నుండి 65 వ జాతీయ రహదారి గుండా కేతేపల్లి మండల పరిధిలోని ఇనుపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపురం స్టేజీ వద్ద రాత్రి బస చేశారు. అనంతరం మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి 12.30 గంటలకు కేతేపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు.

కేతేపల్లి శిబిరంలో భోజనం చేసి మీడియాతో మాట్లాడారు. ఈ నేపధ్యంలో వడదెబ్బ కారణంగా హైఫీవర్‌తో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో టీం సభ్యులు వెంటనే గుర్తించి కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద కు సూర్యాపేట నుంచి హుటాహుటిన వైద్యులను పిలిపించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం నుంచి కేతేపల్లి పాదయాత్ర శిబిరానికి చేరుకొని తన భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నేటితో 96 వ రోజులు కావస్తుంది.

జూన్ నెల అయినప్పటికీ గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉన్నాయని, అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకరావాలన్న బలమైన సంకల్పంతో భగభగ ఎండలు మండుతున్నప్పటికీ ఎండలను సైతం లెక్క చేయకుండా 42 45 డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా పాదయాత్ర చేయడం వల్ల సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళలనకు లోనయ్యారు. వెంటనే వైద్యులను పిలిపించి కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

భట్టి కి పలువురు ప్రముఖుల పరామర్శ :సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్‌రావు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ఎర్రబెల్లి స్వర్ణ, చెవిటి వెంకన్న, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వర్ రావు, వడ్డె నారాయనరావు,రాందాస్ నాయక్, డాక్టర్ రవి, బాలాజీ నాయక్, పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్‌బాబు, మధిర మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు అక్కడి చేరుకొని భట్టి విక్రమార్కను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News