Thursday, January 23, 2025

గచ్చిబౌలిలో రేవంత్ రెడ్డి అధ్యక్షత సీఎల్పీ సమావేశం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం గచ్చిబౌలిలో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది.

ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిషేక్‌ సింఘ్వీకి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ స్వాగతం పలికారు. సీఎల్పీ సమావేశంలో సింఘ్వీని ప్రజాప్రతినిధులకు సిఎం రేవంత్ ప‌రిచ‌యం చేయనున్నారు. సోమవారం సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, కేశ‌వ రావు రాజీమానామాతో ఖాళీ అయిన స్థానం కావ‌డంతో బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News