- Advertisement -
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసింది. సిఎల్పీ నేత ఎంపికను ఏఐసిసికి అప్పగిస్తూ సిఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ఖమ్మం ఎమ్మెల్యే, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు. మరికాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు తరలివెళ్లనున్నారు. ఎమ్మెల్యేలను తరలించడానికి వీలుగా ఇప్పటికే బస్సులను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఈరోజే రాజ్ భవన్ లో జరుగుతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైందనీ, అధిష్ఠానం ప్రకటించడమే తరువాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
సిఎల్పీ భేటీకి పరిశీలకులు కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, జార్జి, దీపా దాస్ మున్షీ, మురళీధరన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తదితరులు హాజరయ్యారు.
- Advertisement -