Friday, November 22, 2024

కేసు దర్యాప్తులో క్లూస్ టీం కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి రివార్డులు
అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: కేసుల దర్యాప్తులో ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీం కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. ఫింగర్ ప్రింట్ యూనిట్ అండ్ క్లూస్ టీం సిబ్బందితో శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. జోన్ల వారీగా ఫింగర్ ప్రింట్ యూనిట్లు, డివిజన్ల వారీగా క్లూస్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు.

కమిషనరేట్‌లో త్వరలోనే రిటైర్డ్ ఫొరెన్సిక్ నిపుణుడి ఆధ్వర్యంలో సెంట్రలైజ్‌డ్ క్లూస్ టీం హెడ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేరం జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించడానికి, నాణ్యతను పెంచడం కోసం ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం యూనిట్లను పటిష్టం చేశామని తెలిపారు. కీలకమైన ఆధారాలను భద్రపరచడానికి, సేకరించడానికి, నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు వేగంగా సంఘటన స్థలానికి చేరుకోవాలని అన్నారు. నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాల సేకరణలో సాంకేతిక పద్దతులను అవలంభించాలన్నారు.

దీంతో క్లిష్టమైన కేసుల దర్యాప్తు వేగవంతం అవుతుందని అన్నారు. కేసుల పనితీరులో ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సిపి రివార్డులు అందజేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎఫ్‌ఎస్‌ఎల్ అండ్ హైదరాబాద్ క్లూస్ టీం హెచ్‌ఓడి వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బందికి వర్క్‌మానిటరింగ్, క్వాలిటీ ఎన్ఫూరింగ్, అకౌంటబిలిటీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో క్రైం డిసిపి కల్మేశ్వర్, ఎసిపిలు, ఫింగర్ ప్రింట్ యూనిట్, క్లూస్ టీం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News