Friday, December 27, 2024

మేడిగడ్డకు సిఎం, మంత్రులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి ఫి బ్రవరి 13న సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు కూడా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సం దర్శించడానికి వెళ్లబోతున్నారు. ఉ.10గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగా నే 10.15 వరకు అసెంబ్లీలో పాల్గొన్న అనంతరం అందరూ కలిసి మేడి గడ్డకు బయలుదేరుతారు. ఇందుకోసం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 3 గంటల్లో బ్యారేజీ వద్దకు చేరుకొని 2 గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుం ది. సా.5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News