Thursday, January 23, 2025

ఢిల్లీ సర్వీస్‌ల బిల్లుపై అమిత్‌షా పసలేని వాదన : కేజ్రీవాల్ విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు ( గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2023) ను తీసుకురాడానికి సరైన కారణ మేమిటో విలువైన ఒక్క వాదన కూడా కేంద్ర మంత్రి అమిత్ షా వినిపించలేకపోయారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. ఏదేమైనా విపక్ష కూటమి ఇండియా ఈ బిల్లును అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ అమిత్‌షా దేశ రాజధానిని ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించగలిగాయని, 2015 తరువాతనే ఆప్ ప్రభుత్వం వచ్చాక సమస్యలు తలెత్తాయని ,

ఆ ప్రభుత్వానికి కేంద్రంతో ఘర్షణ తప్ప ప్రజాసేవ చేయాలన్న ఆసక్తి లేదని విమర్శించారు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టిన తరువాత కేజ్రీవాల్ మొదటిసారి స్పందించి ఢిల్లీ ప్రజలను బానిసలుగా చేయడానికే ఈ బిల్లు అని తీవ్రంగా విమర్శించారు. “ ఢిల్లీ ప్రజల హక్కులను లాక్కొనే ఈ బిల్లుపై లోక్‌సభలో అమిత్ షా మాట్లాడారు. బిల్లుకు మద్దతుగా ఆయన కనీసం ఒక విలువైన వాదనైనా వినిపించలేక పోయారు. తాము పొరపాటు చేస్తున్నామని వారికి తెలుసు. ఈ బిల్లు ఢిల్లీ ప్రజలను నిస్సహాయులుగా చేస్తుంది.” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News