Saturday, February 22, 2025

ఈత కొట్టడం, సెల్ఫీలు దిగడం చేయొద్దు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో సరదా కోసం ఈత కొట్టడం,సెల్ఫీలు దిగడంకోసం ప్యత్నించడం లాంటివి చేయవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. నగరంలోని ముకుంద్‌పూర్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు వరదనీటిలో ఈతకొట్టడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ అలాంటి పనులకు పాల్పడవద్దని ప్రజలను హెచ్చరించారు. ‘చాలా చోట్ల వరద ప్రవాహంలో కొందరు ఈత కొడుతున్నట్ల్లు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్యలు ప్రాణాలకు ప్రాదకరంగా మారే అవకాశం ఉంది. వరద తగ్గుముఖం పట్టినా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా నీటిప్రవాహం పెరిగేప్రమా దం ఉంది. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా’ అని కేజ్రీవాల్ హిందీలో చేసిన ట్వీట్‌లో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News