Wednesday, January 22, 2025

సిబిఐ దర్యాప్తులో ఏం దొరక్కపోతే మోడీ రాజీనామా చేస్తారా ? : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణ కోసం కోట్ల రూపాయలు వృధా చేశారని బిజెపి ఆరోపించడంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఈ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు , ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ పనులకు రూ. 45 కోట్లు ఖర్చు చేసిందని బిజెపి ఆరోపించడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. తనపై విచారణ జరగడం ఇదే తొలిసారి కాదని, ఎన్ని బూటకపు విచారణలు చేపట్టినా తాను తలొగ్గబోనని స్పష్టం చేశారు. ఈ విచారణను గమనిస్తుంటే ప్రధాని మోడీ భయపడుతున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు తనపై 33 కేసులు నమోదు చేశారని, గత ఎనిమిదేళ్లుగా దర్యాప్తులు చేస్తున్నారని, అయినా ఏమీ కనుక్కోలేక పోయారని కేజ్రీవాల్ విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News