Thursday, January 23, 2025

జైలులో ఉన్నా సరే నా జీవితం దేశానికే అంకితం: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తాను జైలులో ఉన్నా లేదా బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితం అని శుక్రవారం ప్రకటించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచింది. ఎక్సైజ్ విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీకి పది రోజుల కస్టడీని ఇడి కోరింది. ‘నేను (జైలు) లోపల ఉన్నా, బయట ఉన్నా నా జీవితం దేశ సేవకే అంకితం’ అని కేజ్రీవాల్ తనను కోర్టులో హాజరు పరుస్తున్నప్పుడు ఒక ‘టివి9 నెట్‌వర్క్’ చానెల్‌తో చెప్పారు.

ఇడి గురువారం రాత్రి అరెస్టు చేసిన తరువాత కేజ్రీవాల్ చేసిన తొలి వ్యాఖ్య ఇది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిరోధించేందుకు పన్నిన ‘రాజకీయ కుట్ర’గా ఆయన అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శించింది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనకు ఆప్ పిలుపు ఇచ్చింది.ఢిల్లీ క్యాబినెట్ మంత్రులు ఆతిషి, సౌరభ్ భారద్వాజ్, తూర్పు ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌తో సహా పార్టీ నేతలు పలువురిని ఐటిఒ వద్ద నిరసన సందర్భంగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News