Monday, December 23, 2024

ఆప్ అంటే బిజెపికి భయం : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

తార్న్ తరణ్ (పంజాబ్): ఆప్ అంటే బీజేపీకి భయమని, అందుకే అపఖ్యాతిపాలు చేసి చిత్తు చేయాలనుకుంటోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం ధ్వజమెత్తారు. ప్రైవేట్ కంపెనీ నుంచి పంజాబ్ ప్రభుత్వం పవర్ ప్లాంట్ కొనుగోలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఆప్ పాలన లోని పంజాబ్‌కు రావలసిన రూ.8000 కోట్ల నిధులు రాకుండా నిలుపుదల చేసిందని ఆరోపించారు. పదేళ్లలో ఆప్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిందని, గుజరాత్, గోవాలో ఆప్ ఎమ్‌ఎల్‌ఎలున్నారని పేర్కొన్నారు. ఎక్కడైతే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామో అక్కడ తాము అనేక ఓట్లను సాధించుకోగలుగుతున్నామని, ఈ విధంగా ఆప్ పెరగడం కొనసాగితే కేంద్రంలో ఆప్ ప్రభుత్వం వస్తుందని బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు.

‘మాకున్న ఒకేఒక శక్తి అది స్పష్టమైన సంకల్పాల్లో నిజాయితీ. మేం ప్రజలకు సేవ చేస్తాం. స్కూళ్లు, ఆస్పత్రులు, రోడ్లు నిర్మిస్తాం. విద్యుత్ వాడకంలో హక్కు కల్పిస్తాం. ఈ పనులేవీ బీజేపీ చేయలేదు” అని తీవ్రంగా విమర్శించారు. గుజరాత్‌లో 30 ఏళ్లు, మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లుగా ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ కనీసం ఒక్క స్కూలైనా సరిగ్గా నిర్మించలేదని వ్యాఖ్యానించారు. వారు ఏం చేయలేదన్నారు. ఆప్ చేపట్టగల పనులన్నీ చేస్తుందని, బీజేపీ మాత్రం చేయలేదని ఎత్తిపొడుస్తూ “ మీకు దమ్ముంటే కొన్ని పనులు చేయండి ” అని బీజేపీకి సవాలు విసిరారు. సిబిఐ, ఈడీలచే తనకు సమన్లు జారీ చేయించడాన్ని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News