Monday, December 23, 2024

మోడీ రాజకీయ వేధింపులకు పరాకాష్ట: గెహ్లోట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సోనియా, రాహుల్‌లపై ఇడి విచారణలు ప్రధాని మోడీ, బిజెపి నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రతీక పరాకాష్ట అని రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్ విమర్శించారు. మోడీ దురహంకార ధోరణికి కాలం చెల్లుతోందని అన్నారు. సోనియా, రాహుల్‌లు ఎప్పుడూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. వీటితో ఎటువంటి కేసులకు భయపడి అయినా రాజీపడేది లేదని వారు రుజువు చేశారని సిఎం స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగపరుస్తోందని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మండిపడ్డారు.
పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల అరెస్టులు
రాహుల్ విచారణకు హాజరయ్యే దశలోదేశవ్యాప్తంగా పలు చోట్ల ఇడి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఢిల్లీలో ధర్నాలకు దిగిన నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, హరీశ్ రావత్ ఇతరులను తుగ్లక్ రోడ్డుకు తరలించారు. వారిని కలిసేందుకు తరువాత ప్రియాంక గాంధీ అక్కడికి వచ్చిన దశలో ఠాణా వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలు ప్రాంతాలలో పార్టీ నేతలు ఖర్గే, ముకుల్ వాస్నిక్, జైరామ్మ్రేశ్, దిగ్విజయ్ సింగ్, భూపీందర్ హుడాలను కూడా అరెస్టు చేశారు.

CM Ashok Gehlot slams PM Modi over ED Investigation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News