Wednesday, January 22, 2025

రియల్ ఎస్టేట్‌కు సిఎం భరోసా

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలను వివరించిన క్రెడాయ్ ప్రతినిధులు

మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) హైదరాబాద్‌మేనేజింగ్ కమి టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు కమిటీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. సిఎం రేవంత్‌రెడ్డి కమిటీ అభ్యర్థనలను స్వీకరించి, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వారికి హామీ ఇచ్చారు.

క్రెడాయ్ హైదరాబాద్ తీసుకుంటున్న చొరవను సీఎం ప్రశంసించారు. స్థిరమైన వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమ వాటాదారుల మధ్య సహకార ప్రయత్నాల అవసరం ఎంతో ఉందని సిఎం అన్నారు. భేటీలో హాజరైన కమిటీ సభ్యుల్లో క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్-ఎలెక్ట్ జైదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. జగన్నాథరావు, ఉపాధ్యక్షులు కోటి, రాంబాబు, మురళీమోహన్, సంయుక్త కార్యదర్శులు క్రాంతి కిరణ్ రెడ్డి, నితీష్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గాను సమగ్ర ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కమిటీ సభ్యులు ఉపయోగించుకున్నారు. రాష్ట్ర ప్రగతికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి సానుకూలంగా సహకరించేందుకు కమిటీ సభ్యులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రియల్ ఎస్టేట్ రంగం సహకారాన్ని మెరుగుపరచడానికి, సానుకూల మార్పులు దిశగా ఒప్పందాలు, భాగస్వామ్యాల కోసం కమిటీ ఎదురుచూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News