Thursday, November 21, 2024

ఆగ్రహంతోనే కంగనపై చేయిచేసుకున్న కానిస్టేబుల్: సిఎం మాన్

- Advertisement -
- Advertisement -

రైతుల ఆందోళనపై గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతోనే బిజెపి ఎంపీగా ఎన్నికైన సినీ నటి కంగనా రనౌత్‌ను సిఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టి ఉండవచ్చని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై కంగన చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన మాన్ ఈ సంఘటన జరిగి ఉండవలసింది కాదని అన్నారు. గత వారం చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ హిమాచల్ ప్రధేశ్‌లో మండి ఎంపి స్థానంలో గెలుపొంది తిరిగివస్తున్న కంగనా రనౌత్‌పై చేయిచేసుకున్న ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి స్పందించడం ఇదే మొదటిసారి. రైతుల నిరసనలపై కంగన వైఖరి పట్ల ఆగ్రహం చెందే తాను ఆమెను చెంపదెబ్బ కొట్టానని కౌర్ ఇదివరకే తెలిపారు.

సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి మాన్‌ను విలేకరులు చెంపదెబ్బ ఘటనపై ప్రశ్నించగా అది ఆగ్రహం&కంగన గతంలో అలాగే మాట్లాడారు ఆ మహిళ(సిఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్) గెండెల్లో కోపం దాగి ఉంది. అలా జరిగి ఉండవలసింది కాదు అని ఆప్ నాయకుడైన మాన్ చెప్పారు. పరోక్షంగా కంగనను ప్రస్తావిస్తూ& ఒక సినిమా నటి కానివ్వండి ఒక ఎంపి కానివ్వండి. యావత్ పంజాబ్ ఉగ్ర రాష్ట్రమని, రాష్ట్రంలో ఉగ్రవాదం ఉందని అనడం తప్పు అని మాన్ హితవు చెప్పారు. ప్రతి విషయంలో వారిని ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అని అంటుంటారని, రైతులు నిరసనలు తెలిపితే వారిని ఉగ్రవాదులని అంటారని, ఇది తప్పని మాన్ చెప్పారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పంజాబ్ పాత్రను ఆయన గుర్తు చేస్తూ పంజాబ్ దేశానికి అన్నం పెడుతోందని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News