Monday, December 23, 2024

నోటాతో బ్యాలెట్‌కు చేటే: సిఎం బఘేల్

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఎవరికి ఓటు వేయకుండా ఉండే నోటాను ఉపసంహరించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ డిమాండ్ చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ పనికిరాని వారని భావించే ఓటర్లు ఈ నోటా ఆప్షన్‌ను ఎంచుకునేందుకు వీలుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో బ్యాలెట్ పేపర్‌లో ఈ నోటా సింబల్ బ్లాక్‌క్రాస్‌ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇది అనవసర ఏర్పాటు అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్నికలలో అభ్యర్థుల జయాపజయాలను శాసించే విధంగా ఒక్కోసారి ఈ నోటా ఓట్లు వచ్చిపడుతున్నాయి. అభ్యర్థుల మధ్య గెలుపోటముల తేడా కన్నా ఎక్కువగా ఈ నోటా ఓట్లు పోలవుతున్నాయి.

మొత్తం ఎన్నికల ప్రక్రియకే విఘాతంగా ఈ నోటా ఉందని, పార్టీలపై అభ్యర్థులపై కొందరు తమ నిరసన వ్యక్తం చేసుకునేందుకు వేరే మార్గాలు ఉంటాయని, ఏకంగా వీరికి ఈ నోటా ఆయధం అందిస్తే ఎన్నికలు పెట్టి ప్రయోజనం ఏమిటని సిఎం ప్రశ్నించారు. పైగా చాలా మంది ఓటర్లు ఈ నోటా గుర్తుతో గందరగోళంలో పడుతున్నారని, దీనిని నొక్కుతున్నారని తెలిపారు. నోటా ప్రక్రియ రావడానికి ముందు ఓటర్లు తమ ఓటింగ్ నిరాసక్తతను ఎన్నికల కమిషన్‌కు రూల్ 490 పరిధిలో తెలియచేసుకునే వీలుండేది. అయితే దీని వల్ల ఓటర్ల నిరసన విషయంలో గోపత్య లేదనే వాదన తలెత్తింది. దీనితో సుప్రీంకోర్టు కలుగచేసుకోవడంతో ఈ నోటా అమలులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News