Monday, December 23, 2024

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు… సిఎం బఘేల్ నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సోమవారం నాడు పటాన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దుర్గ్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసిన దృశ్యాలను తన ఎక్స్ (ట్విటర్) ద్వారా విడుదల చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట స్పీకర్ చరణ్‌దాస్ మహంత , రాష్ట్ర హోం మంత్రి తామ్రధ్వజ్‌సాహు ఉన్నారు. “ మొట్టమొదటిసారి తాను నామినేషన్ దాఖలు చేయడం ఇంకా గుర్తుందని బఘేల్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ మహతరి ( మదర్ ఛత్తీస్‌గఢ్) ఆశీశ్సులతో పటాన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేశానని, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకువస్తానని తన ట్వీట్‌లో తెలిపారు.

నామినేషన్ వేయడానికి ముందు బఘేల్ భార్య ఆయనకు తిలకం దిద్దారు. ఆ ఫోటోను కూడా బఘేల్ ట్వీట్ చేశారు. రూరల్ నియోజకవర్గమైన పటాన్ సరిహద్దులు రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ సరిహద్దులతో కలిసి ఉంటాయి. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు 1993,1998, 2003,2013, 2018లో గెలుపొందారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి , తన మేనల్లుడు విజయ్ బఘేల్ చేతిలో ఓటమి పొందారు. దుర్గ్ నుంచి ప్రస్తుతం లోక్‌సభ సభ్యునిగా ఉన్న విజయ్ బఘేల్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ ఇరువురు నేతలు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News