Tuesday, December 24, 2024

మణిపూర్ హింసలో విదేశీ హస్తం : సిఎం బీరేన్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో దాదాపు రెండు నెలల నుంచి సాగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్త ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ హింస మొత్తం ముందస్తు ప్రణాళికతో పక్కాగా అమలు చేసి ఉంటారని ఆరోపించారు. ఆయన ఓ ఆంగ్ల వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈమేరకు అనుమానం వ్యక్తం చేశారు. “మయన్మార్‌తో మణిపూర్ సరిహద్దులు పంచుకొంటోంది. చైనా కూడా కేవలం 398 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ సరిహద్దులు పూర్తిగా తెరిచే ఉంటున్నాయి. పహారా కూడా తక్కువే.

వాస్తవానికి భద్రతా దళాలు అక్కడ ఉన్నా అంత సువిశాల ప్రదేశాన్ని పర్యవేక్షించడం సాధ్యం కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల్లో ఏ విషయాన్నీ కొట్టిపారేయలేం. అలాగని ఆమోదించలేం. వీటిని చూస్తుంటే ముందస్తు ప్రణాళికలతో జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వీటికి కారణం మాత్రం తెలియడం లేదు. ఇప్పటికే నా కుకీ సోదరసోదరీమణులతో ఫోన్‌లో మాట్లాడాను, జరిగిన దానికి క్షమించి , వదిలేయాలని కోరాను,. ” అని బీరేన్‌సింగ్ వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాజకీయ అజెండాతోనే రాష్ట్రంలో పర్యటిస్తున్నారని బీరేన్‌సింగ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News