Monday, December 23, 2024

మంత్రి ఎర్రబెల్లికి సిఎం ఆశీర్వాదం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ముందస్తుగా సిఎం కెసిఆర్‌ని సోమవారం కలవగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆశీర్వాదం మంత్రి ఎర్రబెల్లి తీసుకున్నారు. మంగళవారం జన్మదినం జరుపుకోనున్న మంత్రి ఎర్రబెల్లికి బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లిని మంత్రి కెటిఆర్ సన్మానించారు. అదే విధంగా మంత్రులు మల్లా రెడ్డి, సబితారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Errabelli 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News