Monday, December 23, 2024

జూబ్లీహిల్స్ లో సిఎం క్యాంప్ ఆఫీస్ ?

- Advertisement -
- Advertisement -

ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలోకి మార్చే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ :  డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి) ప్రాంగణంలోకి సిఎం క్యాంపు కా ర్యాలయం మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సిఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చడంతో .. ఇప్పుడు సిఎం కార్యాలయం మరో చోటికి మార్చాల్సి వ స్తుంది. దీనికి అనుగుణంగానే ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి ప్రాంగణంలోకి మార్చే అవకాశాలు ఉన్నాయి. సిఎం రేవంత్‌రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండడంతో క్యాంపు కార్యాలయంగా అక్కడికి దగ్గరలోనే ఉన్న ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి ప్రాంగణంలోకి మారనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి ప్రాంగణంలో కాన్ఫరెన్సు హాళ్ళు, బోర్డ్ రూమ్‌లు, ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి విడివిడి బ్లాకు లు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో సిఎం క్యాంపు కార్యాల యం ఏర్పాటైతే రెగ్యులర్‌గా జరిగే కాన్ఫరెన్సులు, లెక్చర్లు, శిక్షణా తదితర కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలసింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకా శం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి)ని ఆదివారం సందర్శించారు. ఆ సంస్థ డిజి డాక్టర్ శ శాంక్ గోయల్ సిఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర పంచాయతీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డికి వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, తాజా పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంస్థ కార్యకలాపాల గురించి వాకబు చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డికి వెళ్లిన సందర్భంగా అక్కడి ఫ్యాకల్టీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలను డిజి శశాంక్ గోయల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ గురించి తెలిపారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు వివరించారు. ఇందుకు తగ్గట్లుగా యంత్రాంగం కూడా పని చేయాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, వివిధ విభాగాల ఫ్యాకల్టీల సభ్యులు పాల్గొన్నారు.
నేడు సిఎం సమీక్షా సమావేశం?
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సిఎం క్యాంపు కార్యాలయానికి అణుగుణంగా ఉంటుందా లేదా అన్న అంశంపై సోమవారం సచివాలయానికి నివేదికతో రావాలని సంస్థ అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి రాగానే, ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News