Thursday, December 26, 2024

ఎపి సిఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వరద ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరద ప్రవాహం పరిశీలించేందుకు విజయవాడలోని మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి చంద్రబాబు వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వినకుండా రైలు వంతెనపై నడిచి బుడమేరును పరిశీలించారు. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ పైకి ఓ ట్రైన్ దూసుకొచ్చింది. రైలు చూసి వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపం నుంచి రైలు వెళ్లింది. రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు దాటాక సీఎం సేఫ్‌గా బయటపడటంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News