Wednesday, July 3, 2024

రండి.. మాట్లాడుకుందాం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాసినట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని.. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం రెండు రాష్ట్రాల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్ఫరం సహకారం అందించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో

సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయని తెలిపారు. వాటి కారణంగా మన రెండు రాష్ట్రాల్లో సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోందని, వీటన్నింటిని మనం కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకోసం జూలై 6న శనివారం మధ్యాహ్నం మీ ప్రాంతం సమావేశం ఏర్పాటు చేసుకుందామని తాను ప్రతిపాదిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ఉద్దేశించి చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలు ఇలా ముఖాముఖి సమావేశంలో కూర్చొని చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లబ్ధికలిగే విధంగా పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. మన భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News