Thursday, January 23, 2025

తెలంగాణపై ఫోకస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో తెలుగు దే శం పార్టీకి పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేతలతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని టీడీపీ పాత కమిటీలన్నీ రద్దు చేశారు. ఇకపై అన్ని గ్రామా లు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించిన నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లవంటివని, రెండు ప్రాంతాలు సమ అభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ సమావేశంలో టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

పాత కమిటీల రద్దుతో ప్రారంభం : టీటీడీపీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ టీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అనంతరమే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. ఇదే అంశంపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మరోసారి చర్చ జరగనున్నట్లు సమాచారం. ఏపీ తరహాలోనే కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

టీటీడీపీకి యువ రక్తం ఎక్కిస్తాం : తెలంగాణ తెలుగు దేశం పార్టీకి నూతన జవసత్వాలు అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాబు టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎన్టీఆర్ భవన్‌కి తరలివచ్చారు. ఈ సందర్భంగా బాబు రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘మీ అందరినీ కలవడానికి వచ్చాను. తెలుగు ప్రజలు 45 ఏళ్లగా నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నారు. టీడీపీని బలోపేతం చేశారు. అందుకుతగినట్లే పార్టీ నిరంతరం ప్రజలకు సేవ చేస్తోంది. ఈ కార్యక్రమంలో టీటీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించాం. అడహాక్ కమిటీలు రద్దు చేశాం.

కొత్త కమిటీలు వేస్తాం. ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తాం. పార్టీలో యువ రక్తానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారిని ప్రోత్సహిస్తాం. నాపైన రెండు భాద్యతలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగాలని నన్ను గెలిపించిన ఏపీ ప్రజలకు న్యాయం చేయడం. ఇకపై తెలంగాణకు ప్రతి 15 రోజులకొకసారి వస్తా. మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి నిర్ణయాల మేరకే పార్టీలో నిర్ణయాలుంటాయ ని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీలో యువతను ప్రోత్సహిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువరక్తంతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ వస్తానని, అందరి అభిప్రాయాలు తీసుకుంటానని తెలిపారు. కష్టపడినవారికే పార్టీలో ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

చంద్రబాబును కలిసిన బాబూమోహన్ : టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ నేత, ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్న ఆయన ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కే.ఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ భవన్‌లో ఆయన దర్శనమివ్వడంతో టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భవన్ వేదికగా ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News