ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేది క నుంచి ఉదయం 11గంటలకు ఈ పర్యటన ప్రారంభం కానుంది. 2015 అక్టోబర్ 11న ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మం త్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్‌లను పరిశీలిస్తారు. ఐదేళ్లపాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన జగన్ భవనాలను పాడుబెట్టారని దుయ్యబట్టారు. 70 నుంచి 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసిపి ప్రభుత్వం అడ్డుకుంది. తాజాగా ఆయన ముఖ్యమంత్రి హో దాలో రాజధాని ప్రాంతంలో పర్యటిం చి నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు.
24న ఎపి కేబినెట్ భేటీ
ఎపి మంత్రివర్గ సమావేశం ఈనెల 24న జరగనుంది. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21న సాయంత్రం 4గంటలలోపు ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం స్ప ష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తరువాత తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది.