- Advertisement -
అమరావతి: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో తన కుటుంబంతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలను సిఎం సతీమణి నారా భువనేశ్వరి.. నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు సీఎం దంపతులు.. బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ వేడుకల్లో పాల్గొన్నారు.
అంతకుముందు రాష్ట్ర ప్రజలందరికి సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి వేడుకలతో కుటుంబాల్లో కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు తొలగిపోయి జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
- Advertisement -