Sunday, January 19, 2025

పోలవరం, అమరావతిని రెండేళ్లలో పూర్తి చేస్తాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ పూర్తిగా ధ్వంసమైందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని బాగుచేయడానికి..వినూత్న పద్ధతుల్లో ముందుకు వెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించారని తెలిపారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఆదివారం జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ పునరుద్ధరణకు కేంద్ర సహకారం మరింత కోరుతున్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రస్తుతానికి వెంటిలేటర్‌పై నుంచి రాష్ట్రం బయటపడిందన్నారు. ఇంకా అనారోగ్యంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. పోలవరం, అమరావతిని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. విశాఖ ఉక్కుకు కేంద్రం ప్రాణం పోసిందని.. నదుల అనుసంధానం, బనకచర్ల ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి సహకారం కావాలి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News