Monday, December 23, 2024

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సిఎం చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో సిఎం చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. “దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పయనిస్తోంది.మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వాములు కావాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరున భోజనం పెడతాం’ అని తెలిపారు. అనంతరం పేదలతో కలిసి చంద్రబాబు దంపతులు భోజనం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News