Thursday, January 30, 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడు వెళుతున్నారు. ఫిబ్రవరి 1న ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పార్టీ అభ్యర్ధుల మద్ధతు కోసం బిజేపీ మిత్రపక్షాలను ఎన్నికల ప్రచారంలోకి దింపనుంది. కాగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎపి సీఎం చంద్రబాబునాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ సమస్యలు, ఆర్థిక పరిస్థితిపై సభలో ప్రసావించడంతో పాటు మంత్రులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు.

మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని తెలిపారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు.

కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామన్న చంద్రబాబు ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, ఈ విషయంలో వైకాపా తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News