Thursday, January 9, 2025

రేపు పోలవరానికి సిఎం చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11.45 గంటలకు అక్కడకు చేరుకుని 1.30 వరకు ప్రాజెక్టులోని వివిధ విభాగాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 3 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడతారు. సిఎం రాక దృష్టా చేయాల్సిన ఏర్పాట్లపై జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు.

ముస్లిం సోదరులకు బక్రిద్ శుభాకాంక్షలు

బక్రిద్ పర్వదినం సందర్భంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రిద్ పండుగ ఉద్దేశ్యమని వివరించారు. మానవులు స్వార్థం, రాగ ద్వేషాలను వదిలిపెట్టాలని, త్యాగగుణం పెంపొందించుకోవాలని, సమైక్యత, సమానత్వాన్ని సాధిద్దామని చంద్రబాబు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News