Sunday, December 22, 2024

ప్ర‌భుత్వ సేవ‌లు సులువుగా అందాల‌న్న‌దే సిఎం సంక‌ల్పం

- Advertisement -
- Advertisement -

CM concept is that govt services are easily beautified

గజ్వేల్: సిద్ధిపేటజిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లలాడుతూ… ప్రజలందరికీ అధికార సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని, మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామన్నారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజల మేలు కోసమే సీఎం కేసీఆర్ చేశారని మంత్రి వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవనీ, తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వచ్చాక అన్నీ అభివృద్ధి పథంలో మారి దూసుకుపోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ప్రయివేటు ఆస్పత్రులకంటే గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయని ప్రశంసించారు. ప్రయివేటు ఆసుపత్రికి పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని, ఆరోగ్య లక్ష్మీ పథకం సేవలు ప్రజలు వినియోగించుకోవాలని ఆరోగ్య మంత్రి హరీశ్ కోరారు. త్వరలోనే సంగారెడ్డి కెనాల్ తెచ్చి కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతామన్నారు. ములుగులో మరో కోల్డ్ స్టోరేజీ, పండ్ల మార్కెట్ తేనున్నామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News