Friday, December 27, 2024

సుధాకర్‌ రావుకు సిఎం శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. సుధాకర్‌రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ని మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు ఈ అవకాశం ఇవ్వడం పట్ల కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావుకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News