Wednesday, January 22, 2025

కరోనా బారినపడిన మరో సిఎం

- Advertisement -
- Advertisement -

CM Conrad Sangma tests positive for covid

 

షిల్లాంగ్ : దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి విఐపిల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని, ఏ రంగాల వారిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, మేఘాలయ సిఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు కాన్రాడ్ సంగ్మా ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News