Friday, December 20, 2024

సిఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ

- Advertisement -
- Advertisement -

వేలాదిగా పాల్గొన్న యువ క్రీడాకారులు,
ర్యాలీని ప్రారంభించిన స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
హాజరైన టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, రమేష్ రెడ్డి
నేడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో క్రీడాజ్యోతి ర్యాలీ
32 జిల్లాలు పూర్తి చేసుకున్న టార్చ్ రిలే

మన తెలంగాణ / హైదరాబాద్ :గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సీఎం కప్ 2024 ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసే ఆలోచనతో నిర్వహిస్తున్న టార్చ్ రిలే ర్యాలీ అక్టోబర్ మూడో తేదీ హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమై 31 జిల్లాలు పూర్తి చేసుకుని రంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సిఎం. కప్ ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా టికేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కమాన్ వద్ద వేలాదిమంది క్రీడాకారుల ఉత్సాహ భరితమైన వాతావరణంలో కేరింతల మధ్య క్రీడాజ్యోతి ప్రారంభమై ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంకి చేరుకుంది.

సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సభా కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, చంద్రారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, సాయిబాబా, ఆర్ డి ఓ, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్ స్టేడియం కోచ్‌లు, స్టాఫ్ ,తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ఒనంపిక అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, క్రీడాజ్యోతి సమన్వయ రతన్ కుమార్ బోస్, నంద కిషోర్ గోకుల్ యాదవ్, మధు జిల్లా క్రీడా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ వాలీబాల్ అకాడమీ క్రీడాకారులు, పీఈటీలు, తెలంగాణ పోలీస్ క్రీడ విభాగం క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టార్చ్ రిలే కార్యక్రమం ముగిసిన తర్వాత గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News