తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి జనవరి 2 వరకు ‘సీఎం కప్ -2024’ క్రీడోత్సవాలు జరుగనున్నాయి. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఈ క్రీడోత్సవాల్లో 36 ఈవెంట్స్‌ను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు శివసేనా రెడ్డి వెల్లడించారు.
ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఈ నెల 7, 8 లోపు ఆల్‌నైన్‌లో క్రీడాకారులు వారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో మొదటగా గ్రామ స్థాయిలో పోటీలు, 10-,12వ తేదీల్లో మండల స్థాయిలో, 16, -21 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనే ఆటగాళ్లు తమ పేర్లను అధికారిక వెబ్‌సైట్‌లో తమ సమాచారాన్ని పొందుపర్చాలని సూచించారు. సుమారు 3 లక్షల మంది క్రీడాకారులతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.