Wednesday, January 22, 2025

గజ్వేల్‌లో సిఎం కెసిఆర్‌కు తిరుగులేదు

- Advertisement -
- Advertisement -
  • రాజకీయాల కోసం అమాయకులను చేసి పదవులు అనుభవించలేదా
  • అభివృద్ధిపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదు
  • రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్

గజ్వేల్: గజ్వేల్ ప్రజల కలలకు ఊహకందని విధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రా మాన్ని పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దిన ఘనత సి ఎం కెసిఆర్‌కు దక్కుతుందని రైతుబంధు సమితి రా ష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ అన్నారు.గురువారం ఆయన డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ బే జాల వెంకటేశం, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధులతో కలిసి గజ్వేల్ పట్టణంలో విలేఖరులతో సమావేశంలో మాట్లాడారు.గత 70 సంవత్సరాల లో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల హయాంలో చే యని అభివృద్ధి గజ్వేల్ శాసన సభ్యునిగా ఎన్నికైన కెసిఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 9 ఏళ్ల కాలంలో చేసి చూపించారని తెలిపారు.గతంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలు పచ్చని ప ల్లెల్లో రాజకీయాల కోసం అమాయకులను బలి చే స్తూ పదవులను అనుభవించలేదా అని విమర్శించా రు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి కక్షలు స్వార్థ రాజకీయాలు లేకుండా వేలకోట్ల రూపాయలతో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి జరిగినా మాట వాస్తవం కాదా ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించా రు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రా వాలని ఆయన సవాల్ విసిరారు. నియోజకవర్గంలో తమ ఉనికిని కోల్పోతున్నామనే భావనతో రాష్ట్రస్థాయి నాయకులతో గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారని నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చిన 9 ఏండ్ల పాలనలో నియోజకవర్గ ప్రజలకు ఊహకందని అభివృద్ధి జరిగిందని, పట్టణంలో రైల్వే స్టేషన్, మహతి ఆడిటోరియం, సమీకృత కార్యాలయ భవనం , 100 పడకల ఆసుపత్రి , కేజీ టు పేజీ విద్యాలయం, పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ , వ్యవసాయ విశ్వవిద్యాలయం , సమీకృత కూరగాయల మార్కెట్ ,150 ప డకల మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు వంటివి ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదని, మరోసారి గజ్వేల్ సిఎం కెసిఆర్ పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News